తోటపల్లిలో ఘనంగా వినాయక ఉత్సవాలు అన్నప్రసాదం స్వీకరించిన భక్తులు
రిపోర్టర్: Anjaneyulu Yadav
స్థలం: కల్వకుర్తి
కల్వకుర్తి మండలం తోటపల్లి గ్రామంలో గత 14 రోజులుగా శివాజీ యూత్ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. సోమవారం రాత్రి గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, మహమ్మద్ ఖయ్యిం మరియు బొడ్డుపల్లి నిరంజన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. యువత చేపట్టిన ఈ సేవా కార్యక్రమంపై స్థానికులు ప్రశంసలు కురిపించారు.