జాతీయ ఐక్యతా దినోత్సవం: హన్మకొండలో ఉత్సాహంగా సాగిన ఏకతా రన్
రిపోర్టర్: శివ
స్థలం: హన్మకొండ
సర్దార్ వల్లాభాయ్ పటేల్ జయంతి మరియు జాతీయ ఐక్యతా దినోత్సవం సందర్భంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో, ఏజే పెడల్స్ సహకారంతో హనుమకొండ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో ఘనంగా నిర్వహించిన ఏకతా రన్లో జాతీయ ఐక్యతా స్ఫూర్తితో యువకులు ఉత్సాహంగా పాల్గొన్నట్లు Warangal Police వెల్లడించారు. ఉక్కు మనిషి సర్దార్ వల్లాభాయ్ పటేల్ సేవలు దేశానికే ఎంతో గర్వకారణమని ఈ సందర్భంగా వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత స్పష్టం చేస్తూ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.