భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం: రాష్ట్రంలో సమగ్ర రీసర్వేకు శ్రీకారం చుట్టిన మంత్రి పొంగులేటి

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: నిర్మల్

తెలంగాణలో భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు అత్యాధునిక సాంకేతికతతో సమగ్ర రీసర్వే చేపడుతున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. నిర్మల్ జిల్లా పర్యటనలో ఆయన మాట్లాడుతూ, నిజాం కాలం తర్వాత మొదటిసారిగా మూడు విడతల్లో ఈ సర్వే పూర్తి చేస్తామన్నారు. ప్రతి భూకమతానికి భూదార్ పేరుతో ప్రత్యేక పాసుపుస్తకాలు అందిస్తామని, నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠిన చర్యలు ఉంటాయని మంత్రి స్పష్టం చేశారు.