రామాపురంలో ఘనంగా పల్లె పండుగ మూడో విడత కార్యక్రమం

రిపోర్టర్: sujith reddy స్థలం: బోగోలు

నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం బోగోలు మండలం రామాపురంలో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో పల్లె పండుగ మూడో విడత కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వడ్డెర కార్పొరేషన్ డైరెక్టర్ వల్లెపు మునిస్వామి పరిశీలకుడిగా వ్యవహరించారు. కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డితో పాటు మండల అధ్యక్షుడు నాగేశ్వరావు సహకారంతో ఈ భారీ జనసైనికరణ కార్యక్రమం విజయవంతంగా కొనసాగినట్లు నిర్వాహకులు తెలిపారు.