అనుమతి లేకుండా చెట్టు నరికిన మహిళకు భారీ జరిమానా
రిపోర్టర్: Shahid Syed
స్థలం: లక్సెట్టిపేట
మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట ఆంధ్ర కాలనీలో అనుమతి లేకుండా చెట్టును నరికిన మహిళకు మున్సిపల్ అధికారులు రూ.16 వేల జరిమానా విధించారు. ఎస్ఆర్ఎ అల్తాఫ్ హుస్సేన్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి వాల్టా చట్టం ఉల్లంఘనపై చర్యలు తీసుకున్నారు. అక్రమంగా చెట్లను నరికితే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని, నిబంధనలు పాటించాలని అధికారులు సూచించారు.