ఐటీ ఉద్యోగులకు షాక్: ప్రస్తుత మార్కెట్లో కొత్త కొలువుల సాధన అత్యంత కఠినం

రిపోర్టర్: మహేష్ స్థలం: హైదరాబాద్

దేశంలోని ఐటీ రంగంలో కొత్త ఉద్యోగం సంపాదించడం నిపుణులకు పెను సవాలుగా మారిందని టెక్ నిపుణుడు అమర్నాథ్ శివశంకర్ వెల్లడించారు. లేఆఫ్లు, వేతనాల పెంపు లేకపోవడం వంటి కారణాల వల్ల ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. మెరుగైన అవకాశం వచ్చే వరకు ప్రస్తుత కొలువును వదలవద్దని ఆయన సూచించారు.