కొడుకు నామకరణ వేడుక ఫొటోలు షేర్ చేసిన హీరో నారా రోహిత్ దంపతులు
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: Hyderabad
టాలీవుడ్ హీరో నారా రోహిత్, నటి సిరి లెల్లా దంపతులు తమ కుమారుడి నామకరణ వేడుకను ఘనంగా నిర్వహించి, తొలిసారి బాబు ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. తమ ముద్దుల కుమారుడికి నందన్ రామ నారా అనే పేరును పెట్టినట్లు వారు అధికారికంగా ప్రకటించారు. నందన్ అంటే అంతులేని సంతోషాన్ని కలిగించేవాడు అని, రామ అంటే తాతగారి గౌరవార్థం ఈ పేరు పెట్టినట్లు నారా రోహిత్ ఎమోషనల్ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ఫ్యామిలీ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.