రాష్ట్రంలో పల్లె పండుగ మూడో విడతను ప్రారంభించిన సీఎం

రిపోర్టర్: సతీష్ స్థలం: నెల్లూరు

కేంద్ర ప్రభుత్వ సంపూర్ణ సహకారంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గ పరిధిలోని రామాపురంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్లతో కలిసి ఆయన పల్లె పండుగ మూడు సున్నా కార్యక్రమాన్ని ప్రారంభించారు. గ్రామాల అభివృద్ధి కోసం పదకొండు వేల ఎనభై ఐదు కోట్ల రూపాయల భారీ నిధులను కేటాయిస్తున్నట్లు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రకటించారు.