స్వాతంత్ర్య సమరయోధుడు పెండెం కట్టయ్య సేవలను ఘనంగా స్మరించుకున్న కాంగ్రెస్ నాయకులు
రిపోర్టర్: T.RAJASHEKAR
స్థలం: నర్సంపేట
నర్సంపేట పట్టణంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, స్వాతంత్ర్య సమరయోధుడు పెండెం కట్టయ్య 29వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవోజు సదానందం, పెండెం రామానంద్, పంబి వంశీకృష్ణ తదితరులు పాల్గొని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి కట్టయ్య చేసిన సేవలను నాయకులు స్మరించుకున్నారు.