హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం: ఆగి ఉన్న లారీని ఢీకొన్న దంపతులు దుర్మరణం
రిపోర్టర్: హరి
స్థలం: శ్రీకాకుళం
కోటబొమ్మాళి మండలం కన్నేవలస-చీపుర్లపాడు మధ్య జాతీయరహదారిపై ఆగి ఉన్న లారీని ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో భార్యాభర్తలు తిప్పాన రామారావు, పార్వతి అక్కడికక్కడే మృతి చెందారని పోలీసులు తెలిపారు. భవానీ దీక్ష పూర్తిచేసుకొని అమ్మవారిని దర్శించుకొని ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుందని అధికారులు పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే లారీతో పరారైన చోదకుడిని హైవే సిబ్బంది వెంబడించి పట్టుకున్నారని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శ్రీనివాసరావు వెల్లడించారు.