9/11 దాడుల బాధితులకు ప్రధాని మోదీ ఘన నివాళి
రిపోర్టర్: రాము
స్థలం: అమెరికా
అమెరికాలో జరిగిన భయానక 9/11 ఉగ్రదాడులకు 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ బాధితులను స్మరించుకున్నారు. సరిహద్దు ఉగ్రవాదానికి భారత్ దశాబ్దాలుగా బాధితుడుగా ఉందని, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ నిరంతరం పోరాడుతోందని మోదీ స్పష్టం చేశారు. ఉగ్రవాదంపై ఉమ్మడి పోరాటం అవసరమని పిలుపునిచ్చారు.