ఈఫిల్ టవర్ వద్ద వివాదం, నిరసనలతో తాత్కాలిక మూసివేత.

రిపోర్టర్: వెంకట్ స్థలం: World

ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లోని ప్రసిద్ధ ఈఫిల్ టవర్ సందర్శన సమయంలో తీవ్ర వివాదం చెలరేగింది. బీఏపీఎస్ సంస్థ సభ్యుల బృందం టవర్‌ను సందర్శించినప్పుడు మహిళా సిబ్బందిని విధులకు దూరంగా ఉంచారనే ఆరోపణలతో ఉద్యోగులు నిరసనకు దిగారు. వివక్షకు వ్యతిరేకంగా సిబ్బంది ఆందోళన చేయడంతో టవర్‌ను తాత్కాలికంగా మూసివేశారు. ఈ ఘటనపై పారిస్ మేయర్ సమగ్ర విచారణకు ఆదేశాలు జారీ చేశారు.