తుర్కయంజాల్ లో హైడ్రా కొరడా: కబ్జా భూములు, నాలా ఆక్రమణల తొలగింపు
రిపోర్టర్: భాస్కర్
స్థలం: Turkayamjal
తుర్కయంజాల్ డివిజన్ లో ప్రభుత్వ భూములు మరియు నాలాల ఆక్రమణలపై హైడ్రా అధికారులు సంచలన చర్యలు చేపట్టారని అధికారులు తెలిపారు. స్థానిక కాలనీవాసుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన హైడ్రా సీఐ సైదులు, ఇరిగేషన్ ఏఈ భాగ్యలక్ష్మి క్షేత్రస్థాయిలో పరిశీలించి జేసీబీ సహాయంతో పూడికతీత పనులు ప్రారంభించారు. ప్రభుత్వ భూమికి హద్దులు నిర్ధారించాలని తహసీల్దార్ కు ఆదేశాలు జారీ చేసినట్లు అధికారులు వెల్లడించారు.