డబ్లిన్ విమానాశ్రయంలో తీవ్ర వివక్ష: శ్రీలంక దిగ్గజం కుమార సంగక్కర సంచలన ఆరోపణలు

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: Dublin

డబ్లిన్ విమానాశ్రయంలో తన కుటుంబానికి వేధింపులు ఎదురయ్యాయని శ్రీలంక క్రికెట్ దిగ్గజం కుమార సంగక్కర పేర్కొన్నారు. రాయ్ ఎయిర్ సిబ్బంది తన పట్ల జాతివివక్ష ధోరణితో వ్యవహరించారని ఆయన సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా ఆరోపించారు. పాస్పోర్ట్లను బట్టి ప్రయాణికుల పట్ల వివక్ష చూపడం దారుణమని, తమను బెదిరించేలా మాట్లాడారని సంగక్కర వెల్లడించారు. ఈ ఘటనపై విమానయాన సంస్థ సిబ్బంది తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.