ఢిల్లీలో కలకలం: ఏఐ పోస్టర్ సృష్టించిన వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు

రిపోర్టర్: సునీల్ స్థలం: New Delhi

అదనపు డీసీపీకి సంబంధించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పోస్టర్ను సృష్టించి సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేసిన ఒక వ్యక్తిని అరెస్టు చేసినట్లు ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. నిందితుడిని కోర్టులో హాజరుపరిచి పోలీసు కస్టడీ తీసుకున్నామని, ఈ కుట్ర వెనుక మరింత మంది ప్రమేయం ఉందనే కోణంలో లోతుగా దర్యాప్తు జరుపుతున్నామని అధికారులు స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన నిరసనల సమయంలో పోలీసుల తీరుపై తీవ్ర వివాదం చెలరేగిన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది.