రాజకీయ ప్రవేశంపై కోలీవుడ్ స్టార్ విజయ్‌ను కొనియాడిన నాని

రిపోర్టర్: కిరణ్ స్థలం: తమిళనాడు

టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని చెన్నైలో జరిగిన పారడైజ్ ప్రమోషనల్ ఈవెంట్‌లో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ రాజకీయ ప్రవేశంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేవలం పెద్ద స్టార్ కావడం వలనే ప్రజలు విజయ్‌ను గెలిపించలేదని, తమిళనాడులోని ప్రతీ ఇంటా ఆయన కుటుంబ సభ్యుడిగా మారడం వల్లే ప్రజలు నమ్మి ఓటేశారని నాని కొనియాడారు. రాబోయే ఐదు సంవత్సరాల పాటు విజయ్ అద్భుతమైన పాలన అందించాలని ఆయన ఆకాంక్షించారు.