కూలీ నుంచి జడ్పీటీసీగా అదృష్టం: ఏకగ్రీవ ఎన్నికతో తెదేపా కార్యకర్త సంచలనం
రిపోర్టర్: వెంకట్
స్థలం: చిల్లకూరు
వ్యవసాయ కూలిపనులతో జీవనం సాగిస్తున్న తెదేపా సామాన్య కార్యకర్తను అదృష్టం వరించింది. చిల్లకూరు మండల జడ్పీటీసీ స్థానం ఎస్టీ రిజర్వేషన్ కావడంతో అల్లీపురం గిరిజన కాలనీకి చెందిన ఆడిపూడి బాలసుబ్రహ్మణ్యం బరిలో నిలిచారు. ప్రతిపక్ష పార్టీల నుంచి పోటీ లేకపోవడం మరియు తండ్రి నామినేషన్ ఉపసంహరించుకోవడంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ముప్పై ఏళ్ల వయసులో ఊహించని విధంగా ఉన్నత పదవి దక్కడంతో మండలాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు కృషి చేస్తానని ఆయన వెల్లడించారు.