గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు: కాంగ్రెస్ పార్టీ వ్యూహం మరియు సమన్వయకర్తల నియామకం

రిపోర్టర్: నరేష్ స్థలం: Hyderabad

తెలంగాణలో రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలను దక్కించుకోవడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కసరత్తును ముమ్మరం చేసిందని టీపీసీసీ అధ్యక్షుడు బి. మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ఇందులో భాగంగా అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా 77 మంది సమన్వయకర్తలను నియమించినట్లు ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ స్థానానికి సామ రామ్మోహన్ రెడ్డిని, వరంగల్-ఖమ్మం-నల్గొండ స్థానానికి రామరెడ్డి సర్వోత్తమ్ రెడ్డిని బరిలోకి దింపుతున్నట్లు కాంగ్రెస్ అధిష్ఠానం స్పష్టం చేసింది.