పార్టీ ఫిరాయింపులపై హైకోర్టు తీర్పు కాంగ్రెస్ బీఆర్ఎస్‌లకు చెంపపెట్టు అన్న కిషన్ రెడ్డి

రిపోర్టర్: మహేష్ స్థలం: హైదరాబాద్

పార్టీ ఫిరాయింపులపై హైకోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు చెంపపెట్టు అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన, అధికార దాహంతో ఆ రెండు పార్టీలు ఫిరాయింపులకు పాల్పడుతున్నాయని మండిపడ్డారు. కేసీఆర్ కుటుంబ ఫామ్‌హౌస్‌లపై రేవంత్ రెడ్డి మూడేళ్ల తర్వాత ఎందుకు ప్రశ్నిస్తున్నారని, అనేక ఆరోపణలు చేసినా చర్యలు మాత్రం శూన్యమని ఆరోపిస్తూ అనైతిక రాజకీయాలకు పాల్పడుతున్న ఈ పార్టీలకు ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.