విశాఖలో వినాయక నిమజ్జనోత్సవంలో విషాదం, డ్యాన్స్ చేస్తూ వృద్ధుడు మృతి

రిపోర్టర్: రాజేష్ స్థలం: విశాఖపట్నం

విశాఖపట్నం ఎండాడ ప్రాంతంలో వినాయక చవితి నిమజ్జన ఊరేగింపులో విషాదం చోటుచేసుకుంది. డీజే పాటలకు ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తున్న 62 ఏళ్ల శంకర్రావు ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలి ప్రాణాలు కోల్పోయారు. ఆనందంగా సాగుతున్న వేడుకలో కుటుంబ పెద్ద అకస్మాత్తుగా మరణించడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.