పోలీసుల ఆరోగ్య భద్రతపై ఆందోళన వ్యక్తం చేసిన డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్
రిపోర్టర్: రాము
స్థలం: కుమ్రం భీమ్ ఆసిఫాబాద్
తెలంగాణ కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర ప్రజలను కాపాడుతూ శాంతిభద్రతలను పరిరక్షించే పోలీసుల ఆరోగ్యానికి కూడా కనీస భరోసా లేకుండా పోయిందని డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ (సిర్పూర్) వెల్లడించారు. సికింద్రాబాద్లోని కిమ్స్ ఆసుపత్రిలో అనారోగ్యంతో చికిత్స పొందుతున్న దేవసోత్ శంకర్ అనే పోలీస్ కానిస్టేబుల్ కుటుంబాన్ని ఆయన పరామర్శించి మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రస్తుత ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ, పోలీసులకు ఈహెచ్ఎస్ సేవలు కాకుండా పటిష్టమైన ఆరోగ్య భద్రత కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.