సెన్సార్ పూర్తి చేసుకున్న ఫహాద్ ఫాజిల్ డోంట్ ట్రబుల్ ది ట్రబుల్
రిపోర్టర్: అశోక్
స్థలం: హైదరాబాద్
మలయాళ వర్సటైల్ నటుడు ఫహాద్ ఫాజిల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఫ్యాంటసీ ఎంటర్టైనర్ డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ సినిమా సెన్సార్ కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేసుకుందని చిత్ర యూనిట్ తెలిపింది. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి యు/ఎ సర్టిఫికేట్ను జారీ చేసిందని నిర్మాతలు పేర్కొన్నారు. ఎస్.ఎస్. రాజమౌళి సమర్పణలో శశాంక్ యేలేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రం, గాంధీ జయంతి కానుకగా అక్టోబర్ 2న తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల కానుందని వెల్లడించారు.