గుర్గావ్ హత్య కేసులో యువరాజ్ సింగ్ కుటుంబం సంచలన ఆరోపణలు

రిపోర్టర్: భాస్కర్ స్థలం: New Delhi

ఢిల్లీకి చెందిన హెచ్‌ఆర్ ప్రొఫెషనల్ యువరాజ్ సింగ్ మంచంద హత్య కేసులో గుర్‌గావ్ పోలీసుల తీరుపై కుటుంబ సభ్యులు తీవ్ర ఆరోపణలు గుప్పించారు. సెప్టెంబర్ 10న గుర్గావ్‌లోని ఒక కాలువలో లభించిన మృతదేహాన్ని తమకు సమాచారం ఇవ్వకుండానే, ఎలాంటి నిబంధనలు పాటించకుండా సెప్టెంబర్ 14న అత్యవసరంగా దహనం చేశారని ఆరోపించారు. జీప్‌నెట్ డేటాబేస్‌లో కూడా మృతదేహం వివరాలు అప్‌లోడ్ చేయలేదని, ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.