భారత హాకీ జట్లకు మళ్లీ నీలిరంగు జెర్సీలు కేటాయింపు

రిపోర్టర్: హరి స్థలం: New Delhi

భారత హాకీ జట్లు తిరిగి తమ సంప్రదాయ నీలిరంగు జెర్సీలతో బరిలోకి దిగనున్నాయి. కొద్ది రోజుల క్రితం ప్రవేశపెట్టిన కాషాయ జెర్సీలపై తీవ్ర విమర్శలు, రాజకీయ దుమారం చెలరేగడంతో హాకీ ఇండియా వెనక్కి తగ్గింది. వచ్చే ఆసియా క్రీడల కోసం పురుషుల, మహిళల జట్లకు తొలి ప్రాధాన్యతగా నీలి రంగును ఖరారు చేయగా, కాషాయాన్ని రెండో ఆప్షన్‌గా ఉంచినట్లు ట్రెజరర్ శేఖర్ మనోహరన్ స్పష్టం చేశారు.