టాలీవుడ్ నిర్మాత సి కళ్యాణ్ పై మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో కబ్జా ఫిర్యాదు

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: హైదరాబాద్

టాలీవుడ్ ప్రముఖ సినీ నిర్మాత సి. కళ్యాణ్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. హైదరాబాద్‌లోని మాదాపూర్ సున్నం చెరువు ప్రాంతంలో సియాట్ సొసైటీకి చెందిన భూములను, ప్లాట్లను బలవంతంగా కబ్జా చేయడానికి ఆయన యత్నిస్తున్నారంటూ బాధితులు మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. గుట్టల బేగంపేట్ పరిధిలోని సర్వే నంబర్లు 12, 12A, 13లలో తమ అనుమతి లేకుండా బ్లూ షీట్లు కట్టి అడ్డంకులు సృష్టించారని సొసైటీ అధ్యక్షుడు శ్యామ్ సింగ్ తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.