యువతకు ఉద్యోగాల కల్పనే కూటమి ప్రభుత్వ ప్రధాన నైజమంటూ హోంమంత్రి అనిత విమర్శ

రిపోర్టర్: అశోక్ స్థలం: అమరావతి

యువతకు ఉద్యోగాలు కల్పించడం కూటమి ప్రభుత్వ నైజమని, కానీ రౌడీయిజం చేయడమే వైఎస్ జగన్ నైజమని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అమరావతిలోని ఎన్టీఆర్ భవన్ నుంచి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వ విధానాలపై విమర్శలు గుప్పిస్తూ, యువత భవిష్యత్తు కోసం ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోందని స్పష్టం చేశారు.