స్మశాన వాటికను చెత్త డంపింగ్ కేంద్రంగా మార్చిన మున్సిపల్ అధికారులు

రిపోర్టర్: Srinivasulu akavaram స్థలం: మోత్కూరు

మోత్కూర్ మున్సిపాలిటీలో మృతులకు అంతిమ గౌరవం దక్కాల్సిన స్మశాన వాటిక చెత్త డంపింగ్ కేంద్రంగా మారింది. పట్టణంలో సేకరించిన చెత్తను అక్కడే కుప్పలుగా పోస్తుండటంతో దుర్వాసన వెదజల్లుతోంది. స్మశాన వాటిక పిచ్చి మొక్కలతో నిండిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి చెత్తను తొలగించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.