కేసీఆర్ ఫాంహౌస్ సందర్శనపై కాంగ్రెస్ ఎంపీలపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: హైదరాబాద్
కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన తప్పుడు ఆరోపణలు పార్టీకి డ్యామేజ్ చేయడంతో ఎర్రవెల్లి సందర్శనకు వెళ్దామనుకున్న కాంగ్రెస్ ఎంపీలపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసైన్డ్ భూమి లేదని అధికారులే తేల్చాక అక్కడ ఏం చేస్తారని ఎంపీలను మందలించారు. దీంతో ప్లాన్ మార్చిన ఎంపీలు, ఎర్రవెల్లికి వెళ్లకుండా సిద్దిపేట జిల్లా రంగనాయక్ సాగర్ వద్ద గల మాజీ మంత్రి హరీశ్‌రావు తోటకు వెళ్లి హడావుడి చేశారు.