మైసూర్ మసాలా దోశలో చనిపోయిన ఎలుక లభ్యం

రిపోర్టర్: గోపి స్థలం: Mumbai

ముంబైలోని బోరివలిలో ఉన్న రాధాకృష్ణ హోటల్లో కస్టమర్కు మైసూర్ మసాలా దోశలో చనిపోయిన ఎలుక లభించినట్లు పోలీసులు తెలిపారు. దోశ తిన్న వ్యక్తి వెంటనే తీవ్ర అస్వస్థతకు గురై వాంతులు చేసుకున్నారని అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై బాధితుడు బోరివలి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయగా, హోటళ్లలో ఆహార భద్రత మరియు పరిశుభ్రత లోపాలపై అధికారులు విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం అందించారు.