వేపాడ మండలంలో విషాదం: విద్యుత్ షాక్‌తో జూనియర్ లైన్‌మ్యాన్ దుర్మరణం
రిపోర్టర్: రాజేష్
స్థలం: వేపాడ
విజయనగరం జిల్లా వేపాడ మండలంలోని నీలకంఠరాజపురంలో విద్యుత్ షాక్‌తో జూనియర్ లైన్‌మ్యాన్ దువ్వాడ పైడ్రాజు మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. నల్లబెల్లి సచివాలయానికి చెందిన ఆయన, లైన్‌లోని ఎయిర్ బ్రేక్ క్లోజ్ చేయడానికి వెళ్లిన సమయంలో ఈ ప్రమాదం జరిగిందని వెల్లడించారు. ఘటనాస్థలానికి చేరుకున్న అధికారులు వివరాలు సేకరించి కేసు నమోదు చేసినట్లు ఎస్సై సుదర్శన్ పేర్కొన్నారు.