రాప్తాడులో దారుణం: పాఠశాలలో టెన్త్ విద్యార్థినిపై చెట్లు కోసే రంపంతో దాడి

రిపోర్టర్: హరి స్థలం: రాప్తాడు

అనంతపురం జిల్లా రాప్తాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం నాడు ఓ ఉన్మాది అత్యంత కిరాతక చర్యకు పాల్పడ్డాడు. పదవ తరగతి చదువుతున్న గోపిక లక్ష్మి అనే విద్యార్థినిపై చెక్కలు కోసే విద్యుత్ రంపంతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘోర ఘటనలో బాధితురాలికి చేయి తెగిపోవడంతో పాటు ముఖం, మెడపై తీవ్ర గాయాలయ్యాయి. పాఠశాలలో జరిగిన ఈ పాశవిక దాడి స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.