సాలూరు ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీ నిర్వహించిన ఎమ్మెల్యే
రిపోర్టర్: అశోక్
స్థలం: సాలూరు
సాలూరు వంద పడకల ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. పీఫోర్ విధానంలో భాగంగా దాతల సహకారంతో ఆసుపత్రి అభివృద్ధికి ముందుకు రావడం అభినందనీయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఇందుపూరి నారాయణరావు తన తండ్రి జ్ఞాపకార్థం పది మంచాలను విరాళంగా అందజేశారు.