అసెంబ్లీ తీరుపై ఎమ్మెల్సీ కవిత తీవ్ర విమర్శలు

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: కొడంగల్

తెలంగాణ శాసనసభ సమావేశాలు సాగుతున్న తీరుపై కొడంగల్‌లో జరిగిన బహిరంగ సభలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రజా సమస్యలను గాలికొదిలేసి నాయకులు పార్టీలు మారుతూ, వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. గద్దర్ రాసిన భలేగుందిరో మన అసెంబ్లీ పాటను పాడుతూ ప్రస్తుత రాజకీయాలపై సెటైర్లు వేశారు. ప్రజలు మద్దతిస్తే ఎవరితోనైనా పోరాడేందుకు సిద్ధమని కవిత స్పష్టం చేశారు.