ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో కొణతాల, సీఎం రమేష్
రిపోర్టర్: సునీల్
స్థలం: అనకాపల్లి
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని అనకాపల్లి జిల్లా ఎన్టీఆర్ ఆసుపత్రిలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్, శాసనసభ్యులు, మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ కలిసి పాల్గొని ఆసుపత్రిలోని గర్భిణీలు మరియు బాలింతలకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు.