జిల్లా స్థాయికి ఎంపికైన కింతలి విద్యార్థులు
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: పొందూరు
శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస నియోజకవర్గం పొందూరు మండలం కింతలి గ్రామంలోని పీఎల్ఎన్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు మండల స్థాయి చెకుముకి పరీక్షలో ద్వితీయ స్థానం సాధించి జిల్లా స్థాయికి ఎంపికయ్యారు. ఈ విషయాన్ని పాఠశాల హెచ్ఎం పైడి సూర్యారావు తెలిపారు. విద్యార్థులు మూఢనమ్మకాలను విడనాడి శాస్త్రీయ భావాలను పెంపొందించుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా విజయం సాధించిన విద్యార్థులను మండల విద్యాశాఖ అధికారులు వాగ్దేవి, రాజారావుతో పాటు పాఠశాల ఉపాధ్యాయులు అభినందించారు.