సిడ్నీలో మేయర్ సంధ్యారెడ్డితో భేటీ: హైదరాబాద్ మహిళ సాధనపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ప్రశంసలు
రిపోర్టర్: రాము
స్థలం: హైదరాబాద్
ఆస్ట్రేలియాలోని సిడ్నీలో జరిగిన దసరా మిలన్ వేడుకల్లో స్ట్రాత్‌ఫీల్డ్ కౌన్సిల్ మేయర్ సంధ్యా రెడ్డిని కలుసుకోవడం చాలా సంతోషకరమని కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్‌లో జన్మించిన మహిళ ఆస్ట్రేలియాలో ప్రతిష్టాత్మక కౌన్సిల్‌కు నేతృత్వం వహించడం మన దేశం గర్వించదగ్గ విషయమని ఆయన పేర్కొన్నారు. విదేశాలలో మన తెలుగు వారు ఉన్నత స్థానాలకు ఎదగడం ప్రతి ఒక్కరికీ ఎంతో స్ఫూర్తిదాయకమని, ఆమె మరింత విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ కిషన్ రెడ్డి ప్రత్యేక అభినందనలు తెలిపారు.