నెల్లూరులో మేయర్ దేవరకొండ సుజాత పర్యటన మరియు సమస్యల పరిశీలన

రిపోర్టర్: సతీష్ స్థలం: నెల్లూరు

నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్ దేవరకొండ సుజాత అశోక్ నగర్‌లో శుక్రవారం పర్యటించి 53వ డివిజన్ వారధి సెంటర్ ప్రాంతంలో ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పారిశుద్ధ్య నిర్వహణ, పూడికతీత పనులను ప్రణాళికాబద్ధంగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ప్రజలను కోరగా, ఈ కార్యక్రమంలో తెదేపా నేతలు సుధాకర్ రెడ్డి, మూలం భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.