తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో భారీ ఎదురుదెబ్బ

రిపోర్టర్: సురేష్ స్థలం: హైదరాబాద్

హైదరాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని 40 ఎకరాల భూమి వివాదంలో తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. పిటిషన్ దాఖలు చేయడంలో 219 రోజులు ఆలస్యం కావడంతో రాష్ట్ర ప్రభుత్వం వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. దీంతో ఈ భూమి శాంతా శ్రీరామ్ కన్‌స్ట్రక్షన్ సంస్థదేనంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పు ఖరారైంది. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ చర్యలపై ఈ తీర్పు ప్రాధాన్యత సంతరించుకుంది.