హార్ముజ్ జలసంధిలో భారీ ప్రమాదం: పేలుడుతో అంటుకున్న ఆయిల్ ట్యాంకర్
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: Strait of Hormuz
హార్ముజ్ జలసంధి సమీపంలో మరో ఆయిల్ ట్యాంకర్ ప్రమాదానికి గురైనట్లు ఇరాన్ ఆర్మీ నేవీ అధికారులు వెల్లడించారు. అనధికార సముద్ర ప్రాంతంలోకి ప్రవేశించిన నౌక నావల్ మైన్లను ఢీకొట్టడంతో భారీ పేలుడు సంభవించి మంటలు చెలరేగాయని తెలిపారు. హెచ్చరికలను లెక్కచేయకుండా ముందుకెళ్లిన నౌకపై ఈ ప్రమాదం జరిగిందని, వాణిజ్య నౌకలు నిబంధనలు పాటించాలని ఇరాన్ సైనిక అధికారులు హెచ్చరించారు.