స్థానిక ఎన్నికల్లో హింసాత్మక ఘటనలు: డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా సీరియస్ హెచ్చరిక

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: అమరావతి

రాష్ట్రంలో జరుగుతున్న స్థానిక ఎన్నికల ప్రక్రియలో మొత్తం పదమూడు జిల్లాల్లో ముప్పై ఒక్క హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నట్లు ఏపీ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా వెల్లడించారు. ఇప్పటివరకు పదహారు కేసులు నమోదు చేసి యాభై నలుగురు నిందితులను గుర్తించామని తెలిపారు. నామినేషన్ పత్రాల చోరీ మరియు చింపివేత ఘటనలపై కూడా క్రిమినల్ కేసులు నమోదు చేశామని ఆయన స్పష్టం చేశారు. ఎన్నికల విధుల్లో ఉన్న పోలీసులపై దాడులు చేసేవారికి మరియు హింసను ప్రోత్సహించేవారికి కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారు.