నంద్యాల జిల్లాలో పల్లె నిద్ర: గ్రామీణ ప్రాంతాల్లో పోలీస్ అధికారుల రాత్రి బస
రిపోర్టర్: మహేష్
స్థలం: నంద్యాల
గ్రామీణ ప్రజలకు పోలీస్ శాఖను మరింత చేరువ చేయడం మరియు శాంతిభద్రతలను పర్యవేక్షించడం లక్ష్యంగా నంద్యాల జిల్లాలోని పలు సబ్ డివిజన్లలో ఏఎస్ఐ, ఎస్ఐ స్థాయి అధికారులు పల్లె నిద్ర కార్యక్రమాన్ని నిర్వహించినట్లు Nandhyala SP వెల్లడించారు. నైట్ హాల్ట్ రూపంలో చేపట్టిన ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా స్థానిక ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని, నేరాల నియంత్రణపై దిశానిర్దేశం చేశామని ఆయన పేర్కొన్నారు.