ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో అక్రమాలపై సమగ్ర విచారణ జరపాలి
రిపోర్టర్: వెంకట్
స్థలం: పెద్దపల్లి
పెద్దపల్లి జిల్లా కమాన్‌పూర్ మండలంలో ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో పెద్దఎత్తున అక్రమాలు జరుగుతున్నాయని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. అర్హులైన నిజమైన నిరుపేదలకు ఇళ్లు దక్కకుండా డబ్బులు వసూలు చేస్తున్నారని విమర్శించారు. ఈ అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో నిరుపేదలను అడ్డంపెట్టుకుని పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.