కాగితాల వేటలో విలవిల్లాడుతున్న నిరుపేద రోగుల ప్రాణాలు
రిపోర్టర్: BHANUCHANDER DOMMATI
స్థలం: వర్ధన్నపేట
వరంగల్ జిల్లా వర్ధన్నపేట ప్రభుత్వ ఆసుపత్రిలో సిబ్బంది నిర్లక్ష్యంపై బాధితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయపర్తి మండలానికి చెందిన ఓ వ్యక్తి తీవ్ర జ్వరంతో ఆసుపత్రికి రాగా అందించాల్సిన అత్యవసర చికిత్సను పక్కనపెట్టి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారని బంధువులు ఆరోపించారు. కే షీట్, నంబర్ పేరిట కాగితాల ప్రక్రియ పూర్తి చేయాలంటూ ఇరవై నిమిషాల పాటు రోగిని నిరీక్షించేలా చేసి ప్రాణాలతో చెలగాటమాడారని వాపోయారు. ప్రాణాపాయంలో ఉన్న రోగికి ముందుగా వైద్యం అందించాలా లేక కాగితాల ప్రక్రియ ముఖ్యమా అని ప్రశ్నిస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరించిన బాధ్యులపై ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.