మెగా డీఎస్సీ ఎంపికలపై దుష్ప్రచారం తగదు: శాప్ ఎండీ భరణి
రిపోర్టర్: సురేష్
స్థలం: అమరావతి
ఏపీలో మెగా డీఎస్సీ స్పోర్ట్స్ కోటా ఎంపికలు పూర్తిగా పారదర్శకంగా జరిగాయని శాప్ ఎండీ భరణి స్పష్టం చేశారు. పోస్టులు రానివారితో నిరాధార ఆరోపణలు చేయిస్తున్నారని మండిపడ్డారు. డీవోపీటీ నిబంధనల ప్రకారమే అర్హులను ఎంపిక చేశామని తెలిపారు. మరోవైపు టెట్ అర్హత మార్కులు, వెయిటేజీ నిబంధనలపై పాఠశాల విద్య కమిషనర్ తమీమ్ అన్సారియా స్పష్టతనిచ్చారు.