హైదరాబాద్ ఐఫ్లూ వద్ద టిప్పర్ ఢీకొని వ్యక్తి మృతి

రిపోర్టర్: సతీష్ స్థలం: హైదరాబాద్

హైదరాబాద్ నగరంలోని ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఐఫ్లూ సమీపంలో బుధవారం స్కూటీపై వెళ్తున్న ఒక వ్యక్తిని వేగంగా వచ్చిన టిప్పర్ లారీ ఢీకొట్టిందని వెల్లడించారు. ఈ ప్రమాదంలో ఆ వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడని పేర్కొన్నారు. ఘటన అనంతరం డ్రైవర్ వాహనాన్ని అక్కడే వదిలి పరారయ్యాడని, ఓయూ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని స్పష్టం చేశారు.