'ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం': మార్కాపురంలో ఘనంగా 'మీ కోసం' కార్యక్రమం
రిపోర్టర్: భాస్కర్
స్థలం: Markapur
మార్కాపురం జిల్లాలో ప్రజల ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించే లక్ష్యంతో 'మీ కోసం' (ప్రజా సమస్యల పరిష్కార వేదిక) కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించగా, మొత్తం 46 ఫిర్యాదులు అందినట్లు అధికారులు వెల్లడించారు. బాధితుల సమస్యలను ఓపికగా విన్న పోలీసులు, వాటిని త్వరలోనే పరిష్కరిస్తామని భరోసా కల్పించారు.