80ల నాటి జ్ఞాపకాలను పంచుకున్న సీఎం చంద్రబాబు!

రిపోర్టర్: సతీష్ స్థలం: అమరావతి

సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న 80ల నాటి ట్రెండ్‌లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఆ కాలంలో తాను నిజంగా దిగిన కొన్ని అరుదైన ఫొటోలను ఎక్స్ వేదికగా ఆయన పంచుకున్నారు. 80ల జ్ఞాపకాల్లో తాను కూడా చేరుతున్నానని, అప్పట్లోని తన అసలైన ఫొటోలు ఇవేనంటూ చంద్రబాబు పోస్ట్ చేశారు. మంత్రి నారా లోకేశ్ సైతం ఈ ట్రెండ్‌లో చేరి తన ఫొటోను పంచుకున్నారు.