స్థానిక ఎన్నికల్లో గెలుపుపై సీఎం చంద్రబాబు ధీమా: జగన్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు

రిపోర్టర్: కృష్ణ స్థలం: అమరావతి

ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాం కాబట్టే స్థానిక ఎన్నికల్లో ధైర్యంగా ఓట్లు అడుగుతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. బాధ్యత గల నాయకులకే అధికారం అప్పగించాలని ప్రజలను కోరారు. మంచిని చూడలేక, అభివృద్ధిని తట్టుకోలేక ఫ్రస్ట్రేషన్తోనే ఎన్నికలను జగన్ అడ్డుకోవాలని చూశారని మండిపడ్డారు. కూటమిగా ఏర్పడి విధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మించేందుకు ప్రజలు అప్పగించిన బాధ్యతను సమర్థంగా నిర్వర్తిస్తున్నామని చంద్రబాబు పేర్కొన్నారు.