పంజాబ్ లో ఆప్ కు గట్టి షాక్: ఇద్దరు ఎమ్మెల్యేల శాసనసభ్యత్వానికి రాజీనామా

రిపోర్టర్: నరేష్ స్థలం: చండీగఢ్

పంజాబ్ లో అధికార ఆమ్ ఆద్మీ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల మొదటి జాబితా ప్రకటన వెలువడిన మరుసటి రోజే సనౌర్ ఎమ్మెల్యే హర్మీత్ సింగ్ పఠాన్ మజ్రా, సమానా ఎమ్మెల్యే చేతన్ సింగ్ జోరా మజ్రా తమ శాసనసభ్యత్వాలకు రాజీనామాలు సమర్పించినట్లు అసెంబ్లీ వర్గాలు వెల్లడించాయి. పార్టీ నాయకత్వ తీరుపై కొద్దికాలంగా నెలకొన్న తీవ్ర అసంతృప్తి కారణంగానే వీరు ఈ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు రాజకీయ వర్గాల్ లో చర్చ సాగుతోంది.