ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యోగుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం: ఎన్. రామచందర్రావు ధ్వజం

రిపోర్టర్: రమేష్ స్థలం: సికింద్రాబాద్

ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యోగులు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం, యూనివర్సిటీ అధికారులు వెంటనే స్పందించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్రావు డిమాండ్ చేశారు. పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించడంతో పాటు పెన్షన్, పదవీ విరమణ ప్రయోజనాలు, వైద్య సదుపాయాలు కల్పించాలని కోరారు. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లు నెరవేరే వరకు వారి పక్షాన నిలబడి పోరాటానికి సంపూర్ణ మద్దతు ఇస్తామని ఆయన స్పష్టం చేశారు.